జాన్వీ కపూర్ ఎంట్రీ ఆలా ఫిక్స్ అయింది

Update: 2023-02-13 16:38 GMT

శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తొలిసారి టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. ఆమె పేరు ఎప్పటినుంచో పలు సినిమాల విషయంలో ప్రచారంలోకి వచ్చింది. ఒకసారి మహేష్ బాబు తో జోడి కడుతుంది అని..మరో సారి విజయదేవరకొండ తో కలిసి సినిమా చేస్తోంది అని ప్రచారం జరిగింది. కానీ అవేమి వాస్తవ రూపం దాల్చలేదు. కానీ ఈ సారి మాత్రం ఫిక్స్. కొరటాల శివ తెర కెక్కిస్తున్న ఎన్టీఆర్ 30 లో జాన్వీ కపూర్ నటించబోతుంది. ఈ విషయం ఖరారు అయినట్లు టాలీవుడ్ వర్గాలు నిర్దారించాయి. అంతే కాదు ఆమెకు ఏకంగా రెండు కోట్ల రూపాయల మేర రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

                                        అయితే ఇందులో ఎంత వాస్తవం ఉన్నది తెలియాలి. అయితే ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబినేషన్ సినిమాపై అంచనాలు పెంచటానికి మాత్రం పక్కాగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ మంచి హిట్ దక్కించుకున్న విషయం తెలిసిందే. దాని తర్వాత సినిమా ఇదే కావటంతో దీనిపై కూడా అభిమానుల్లో అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ నెలలోనే సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభించి...మార్చి నుంచి రెగ్యులర్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. దీంతో అత్యంత కీలకం అయినా హీరోయిన్ ను ఫైనలైజ్ చేశారు.

Tags:    

Similar News