ఇక రాజమౌళి విషయానికి వస్తే బాహుబలి రెండు భాగాలు, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత అయన కొత్త సినిమా ప్రకటిస్తున్నారు అంటేనే అందరి దృష్టి వాటిపైనే . ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు తో కలిసి ఒక కొత్త సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు అంటే చాలు అది విడుదల అయ్యే వరకు దీనిపై హైప్ అలా పెంచుకుంటూ పోతారు. ఇప్పటివరకు అయన కెరీర్ లో ఒక్కటి అంటే ఒక్కటి కూడా వాణిజ్య పరంగా ఫెయిల్ అయిన సినిమా లేదు అంటే రాజమౌళి సత్తా అర్ధం చేసుకోవచ్చు. ఇక ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే అయన పేరు దేశంలో మారుమోగింది కెజీఎఫ్ సినిమాలతోనే అని చెప్పాలి. కెజీఎఫ్ 2 ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 1250 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం నమోదు చేసింది. ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమా తో కూడా అయన తన మార్క్ చూపించారు. కలెక్షన్ల పరంగా సలార్ దుమ్మురేపుతోంది.దక్షిణాది సినిమాలు...ఈ ప్రాంతానికి చెందిన డైరెక్టర్ల ప్రభావం బాలీవుడ్ పై ఎంతగా పడింది అంటే...బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ ఏకంగా తమిళ్ డైరెక్టర్ అట్లీ తో కలిసి జవాన్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ టాలీవుడ్ కు చెందిన టాప్ హీరో ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమా చేయనున్నారు...దీంతో పాటు సలార్ పార్ట్ 2 కూడా ఉన్న విషయం తెలిసిందే. వంగా సందీప్ రెడ్డి ప్రభాస్ తో కలిసి స్పిరిట్, అల్లు అర్జున్ తో మరో ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. రాబోయే రోజుల్లో ఈ ముగ్గురు దర్శకులు భారతీయ సినిమా చరిత్రలో కొత్త కొత్త రికార్డులు నెలకొల్పటం ఖాయం అని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.