మ‌హేష్ బాబు త‌ల్లి ఇందిరా దేవి మృతి

Update: 2022-09-28 03:28 GMT

హీరో మ‌హేష్ బాబు త‌ల్లి ఇందిరాదేవి క‌న్నుమూశారు. కొద్ది కాలం క్రితం ఆమె ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి కానీ..చాలా వ‌ర‌కూ ఆమె ఎలా ఉంటారో చాలా మందికి తెలియ‌దు. ఆమె ఎక్క‌డా బ‌య‌ట పెద్ద‌గా క‌న్పించేవారు కాదు. ఘట్టమనేని కృష్ణ భార్య అయిన ఇందిరాదేవి బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు.తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి నివాసంలోనే క‌న్నుమూశారు.

కృష్ణ, ఇందిరాదేవికి ఐదుగురు పిల్ల‌లు. రమేష్‌బాబు, మహేష్‌బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. ఇందిరాదేవి మృతితో క్రిష్ణ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మహేష్ బాబు..ఇందిరాదేవి బర్త్ డే రోజున, మదర్స్ డే రోజున, విమెన్స్ డే రోజున ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తనకు తల్లి పట్ల ఉన్న మమకారాన్ని అభిమానులతో పంచుకునేవారు. కొద్ది కాలం క్రిత‌మే మ‌హేష్ సోద‌రుడు రమేష్ బాబు అనారోగ్యంతో మ‌ర‌ణించారు. 

Tags:    

Similar News