అధికారిక ప్రకటన వచ్చేసింది

Update: 2026-02-21 10:12 GMT

గత కొన్ని రోజులుగా రజనీ కాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ మూవీ గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. 46 సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరు టాప్ హీరోలు మరో సారి కలిసి నటించనున్నారు. ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తున్నది నెల్సన్ దిలీప్ కుమార్. ఈ సినిమా కు సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియో ను చిత్ర యూనిట్ శనివారం నాడు విడుదల చేసింది. కె హెచ్, ఆర్ కె రీ యూనియన్ అంటూ ఈ వీడియో తో పాటు ఒక లుక్ కూడా విడుదల చేశారు. ఇందులో ఇద్దరూ హీరో లు స్టైలిష్ గా లో కనిపించారు.

                                           ఈ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌లో దర్శకుడు నెల్సన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ కూడా ఉంటారు. Full Viewఈ ఇద్దరు స్టార్ హీరోలను ఎలాంటి పాత్రల్లో చూపిస్తాడు ..ఇందులో మిగతా నటీ నటులు ఎవరు ఉంటారు వంటి ప్రశ్నలకు త్వరలోనే సమాధానం రానుంది. ఈ స్పెషల్ గ్లింప్స్ తో దర్శకుడు ఈ సినిమాపై అంచనాలను పెంచాడు అనే చెప్పాలి. ఇందులో ఎవరు హీరో నే చెప్పాలి అంటూ కమల్ హాసన్, రజనీకాంత్ లు వేసే ప్రశ్న ఇందులో హై లైట్ గా నిలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News