యష్ హీరో గా నటించిన టాక్సిక్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం కేజీఎఫ్ రెండు పార్ట్ ల తర్వాత ఈ హీరో నుంచి వస్తున్న సినిమా ఇదే కావటం కూడా ఒకటి. టాక్సిక్ మూవీ మార్చి 19 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొద్ది రోజుల క్రితం ఈ మూవీ లో హీరో యష్ పాత్ర రయా ను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ విడుదల చేసిన వీడియో ఒకటి దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. దీనికి ప్రధాన కారణం ఇందులో ఉన్న బోల్డ్ కంటెంటే. ఈ వీడియో పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు సెన్సార్ బోర్డు సైతం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీనికి తాము ఆమోదం తెలపలేదు...ఇది తమ దగ్గరకు రాలేదు అని ప్రకటించారు అప్పటిలో.