వచ్చే ఏడాది మే లో ప్రేక్షకుల ముందుకు

Update: 2026-07-08 13:43 GMT

దేశంలో క్రీడా అభిమానులు క్రికెటర్లను ఎంతగా ఆరాధిస్తారో తెలిసిందే. ముఖ్యంగా స్టార్ క్రికెటర్లకు బాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా ఫ్యాన్స్ ఉంటారు. వీళ్లకు ఉండే క్రేజ్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పటికే క్రికెట్ లో ఎన్నో సంచలన విజయాలు నమోదు చేసిన ఎం ఎస్ ధోని బయోపిక్ వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎం ఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ పేరుతో విడుదల అయిన ఈ సినిమా దగ్గర దగ్గర వంద కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 215 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా 2016 సెప్టెంబర్ 30 న విడుదల అయింది. ఇప్పుడు దాదా గా క్రికెట్ అభిమానులు పిలుచుకునే సౌరవ్ గంగూలీ బయో పిక్ రానుంది. ఈ సినిమా కు సంబదించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ బుధవారం నాడు విడుదల చేసింది.

                                              Full Viewలార్డ్స్ బాల్కనీలో 2002 జులై 13 న గంగూలీ నాట్ వెస్ట్ ట్రోఫీ ఫైనల్ లో ఇంగ్లాండ్ ను ఓడించిన తర్వాత జెర్సీ విప్పేసిన ఐకానిక్ సీన్‌ను రీక్రియేట్ చేస్తూ రాజ్‌కుమార్ రావు లుక్‌ను రెవీల్ చేశారు. ఇది అప్పటిలో పెద్ద ఎత్తున సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది మే 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారత క్రికెట్ జట్టుకి సారధ్యం వహించడమే కాకుండా క్రికెటర్ గా కూడా సౌరవ్ గంగూలీకి ఎన్నో రికార్డులు ఉన్నాయి. ‘దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ’.. అతను ఆట ఆడలేదు ఆటనే మార్చేశాడు అనే ఉప శీర్షికతో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్, డిబిఎల్ సంస్థలు సమర్పణలో సినిమా తెరకెక్కనుంది.

Tags:    

Similar News