సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్లుగానే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి లాస్య ఎలిమినేట్ అయ్యారు. ఆదివారం నాడు జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో చివరిగా లాస్య, అరియానాలే మిగిలారు. చివరకు ఎవరి ఫోటో మీద లైట్ వస్తుందో వారు సేవ్ అవుతారని ప్రకటించారు హోస్ట్ నాగార్జున . సీన్ కట్ చేస్తే అరియానా ఫోటో మీద లైట్ వచ్చింది. దీంతో లాస్య ఎలిమినేట్ అయిపోయింది. లాస్య ఎలిమినేషన్ తో ప్రస్తుతం హౌస్ లో కేవలం ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలారు.
మరో నాలుగు వారాల్లో ఈ కార్యక్రమం ముగిసిపోతుందని హోస్ట్ నాగార్జున ప్రకటించారు. సోహైల్, అభిజిత్ లు టాప్ టూలో ఉంటారని అనుకుంటున్నట్లు లాస్య చెప్పింది. ఇప్పటివరకూ ఎలిమినేట్ అయిన సభ్యులతో పోలిస్తే లాస్య మాత్రం ఏ మాత్రం సీన్ క్రియేట్ చేయకుండా కూల్ గా బయటకు వెళ్లిపోయింది. విచిత్రం ఏమిటంటే కార్యక్రమం జరక్కముందే ఎలిమినేషన్ తోపాటు పలు కీలక విషయాలు అన్నీ ముందే లీక్ అవుతుండటంతో బిగ్ బాస్ షో పై ప్రేక్షకుల్లో ఏ మాత్రం ఆసక్తి లేకుండా పోతోంది.