ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో సభ్యులు అందరూ మోనాల్ నే టార్గెట్ చేశారు. ఎప్పటిలాగానే సోమవారం నాడు ఎలిమినేట్ అయ్యే వారిని ఎంపిక చేశారు. ఇందుకు బిగ్ బాస్ నలుగురు సభ్యులకు 'టోపీలు' పెట్టారు. ఆ జాబితాలో అవినాష్, అభిజిత్, అఖిల్, అరియానాలు పెట్టుకున్న టోపీల్లో రెడ్ కలర్ వచ్చింది. దీంతో వారిని నామినేట్ చేశారు. రెండవ దశలో స్వాపింగ్ కు ఛాన్స్ ఉందని బిగ్ బాస్ ప్రకటించారు. అయితే అందుకు నామినేట్ అయిన వారు ఎందుకు హౌస్ లో కొనసాగాలి ..నామినేట్ చేయాలనుకునే వారు ఎందుకు అక్కర్లేదో సరైన కారణం చెప్పాలన్నారు. తొలుత అవినాష్ స్వాపింగ్ గురించి మాట్లాడుతూ తొలుత సోహైల్ ను స్వాపింగ్ అంగీకరించాలని కోరాడు. ఎలాగైనా సోహైల్ నిన్ను అభిమానులు సేవ్ చేస్తారు కాబట్టి ఇందుకు అంగీకరించాలని కోరాడు. అయితే సోహైల్ అందుకు అంగీకరించలేదు. తాను కూడా అవినాష్ ను అభిమానులు రక్షిస్తారని భావిస్తున్నట్లు సోహైల్ తెలిపాడు. ఆ తర్వాత అవినాష్ స్వాప్ గురించి మాట్లాడుతూ మోనాల్ కంటే గేమ్ లో, హౌస్ లో తానే ఉండాల్సిన అవసరం ఉందని..మోనాల్ కంటే తానే గట్టి ప్లేయర్ అని ప్రకటించాడు. అయితే అందుకు మోనాల్ కూడా అంగీకరించలేదు. తాను కూడా గట్టి పోటీదారునే అని..ఇప్పటికే చాలా శక్తివంతంగా మారానని తెలిపారు.
అవినాష్ లాగే అఖిల్ కూడా స్వాప్ కు మోనాల్ నే ఎంచుకున్నారు. దీనిపై ఇద్దరి మధ్య పెద్ద రచ్చే నడిచింది. అరియానా మాత్రం తనకు సాయం బాకీ ఉందని..స్వాప్ కు ఒప్పుకోవాలని సోహైల్ ను కోరింది. కానీ సోహైల్ తిరస్కరించాడు. తర్వాత అరియానా కూడా మోనాల్ కంటే తాను శక్తివంతురాలునని..అందుకే స్వాపింగ్ కు ఒప్పుకోవాలని కోరింది. అయినా సరే ఇద్దరి మధ్య వాగ్వాదం సాగింది. మోనాల్ నీకు లక్ వచ్చింది...సరే కష్టపడిన మేం ఏమి కావాలి అంటూ అవినాష్, అరియానాలు మోనాల్ ను ప్రశ్నిస్తారు. మోనాల్ తల్లి తనను ఫేవరేట్ ప్లేయర్ అని చెప్పింది అని...అందుకే తాను మోనాల్ ను స్వాప్ చేయాలని కోరనని అభిజిత్ ప్రకటించాడు. చివరకు బిగ్ బాస్ కెప్టెన్ హారికను స్వాప్ చేయమని ఆదేశిస్తాడు. దీంతో హారిక మోనాల్ ను అభిజిత్ కు స్వాప్ చేస్తూ నిర్ణయం తీసుకుంటుంది. దీంతో ఫైనల్ గా ఈ వారంలో నామినేషన్ లో అవినాష్, అఖిల్, అరియానా, మోనాల్ లు ఉన్నారు.