బిగ్ బాస్..'హౌస్ ఫుల్'

Update: 2020-12-18 09:51 GMT

మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ తెలుగు నాలగవ సీజన్ ముగియనుంది. అందుకే హౌస్ లోకి ఈ సీజన్ లో పాల్గొన్న వారంతా మళ్ళీ వచ్చేశారు. ఈ రెండు రోజులు సందడే సందడి. ఆదివారం నాడు ఫైనల్ ట్రోఫీ విజేత ఎవరో తేలనుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా మెగాస్టార్ చిరంజీవి వస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. సీజన్ ముగింపు దశకు చేరుకోవటంతో పాత కంటెస్టెంట్స్ అందరూ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

ఇటీవలే బయటకు వెళ్ళిన మోనాల్ తోపాటు అవినాష్, లాస్య, గంగవ్వ తో సహా అందరూ రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే వీళ్ళను కోవిడ్ కారణంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఓ గ్లాస్ అవతల ఉంచారు. అక్కడ నుంచే లాస్య ఓ షో నడిస్తుంది. అఖిల్ కు ఈ హౌస్ లో ఎక్కువ హగ్ లు వచ్చాయి అవునా..కాదా?. అభిజిత్ ఈ హౌస్ లో డ్యాన్స్ నేర్చుకున్నారు. అరియానా గొంతు జలజ గొంతు కంటే భయంకరంగా ఉంటుంది అంటూ వరసగా ప్రశ్నలు వేసి ఫైనలిస్టుల నుంచి సమాధానం రాబడుతుంది. ఫుల్ ఎపిసోడ్ చూస్తే కానీ ఈ సందడి రేంజ్ ఎలా ఉందో తెలియదు.

Tags:    

Similar News