అవినాష్ ను కాపాడిన ఎవిక్షన్ పాస్

Update: 2020-11-30 04:31 GMT

బిగ్ బాస్ షోలో ఈ వారం ఎలాంటి ఎమినేషన్ లేకుండానే గడిచిపోయింది. ఎలిమినేషన్ రౌండ్ లో చివరగా అవినాష్, అరియానాలు మిగిలారు. ఇద్దరూ టోపీల్లో చేతులు పెట్టి ఎవరి చేతికి రెడ్ ఉంటే వారు ఎలిమినేట్ అయినట్లు, గ్రీన్ ఉంటే సేవ్ అయినట్లు అని ప్రకటించారు హోస్ట్ నాగార్జున. ఒక్కటే టెన్షన్. అయితే అనుకున్నట్లే అరియానా సేవ్ అయింది. అవినాష్ ఎలిమినేట్ అయ్యారు. తన చేతిలో ఉన్న ఎవిక్షన్ పాస్ తో అవినాష్ సేవ్ అయ్యాడు. అంతకు ముందు నాగార్జున అవినాష్ తో ఈ వారంలోనే ఎవిక్షన్ పాస్ వాడుకుంటావా? లేక ఎవిక్షన్ పాస్ గేమ్ లో ఎంతో సహాయపడిన అరియానాకు ఇస్తావో తేల్చుకోవాలని కోరతాడు. అయితే అవినాష్ మాత్రం అరియానా ఖచ్చితంగా సేవ్ అవుతుందని, తన కోసమే వాడుకుంటానని ప్రకటించాడు. హౌస్ సభ్యుల అభిప్రాయం తీసుకోగా..వాళ్ళు కూడా ఈ వారం సొంతానికే వాడుకోవాలని సూచిస్తారు. అయితే ఎవిక్షన్ పాస్ తో ఈ వారానికి బచాయించినా కూడా ఒకింత భావోద్వేనానికి గురయ్యాడు అవినాష్.

తాను ఎలిమినేట్ అయిన విషయాన్ని జీర్ణించుకోలేక...మంచిగా ఆడుతున్నా ఇలా చేశారంటూ నిట్టూర్చాడు. అయితే నాగార్జున మాట్లాడుతూ నీ దగ్గర ఎవిక్షన్ పాస్ ఉందనే కారణంతోనే తక్కువ ఓట్లు వేసి ఉండొచ్చుగా గేమ్ పై దృష్టి పెట్టి ముందుకు సాగాలని సూచిస్తాడు. ఆదివారం నాటి బిగ్ బాస్ షోలో కొద్దిసేపు కన్నడ నటుడు సుదీప్ కిచ్చా సందడి చేశారు. కొద్ది సేపు హోస్ట్ పాత్ర పోషించి వెళ్లిపోయారు. సుదీప్ ఉన్న సమయంలోనే హౌస్ లో ఉన్న ఎవరితో డేట్ చేస్తావు..ఎవరిని పెళ్ళి చేసుకుంటావు, ఎవరిని చంపేస్తావు అని అవినాష్ ను అడుగుతాడు. అయితే అవినాష్ మాత్రం మోనాల్ తో డేట్ కు వెళతానని, హారికను పెళ్లి చేసుకుంటానని, అరియానాను హత్య చేస్తానని ప్రకటించాడు. ఇది అంతా సందడి సందడిగా సాగిపోయింది.

Tags:    

Similar News