అభిజిత్, అఖిల్ ను ఆటపట్టించిన అవినాష్

Update: 2020-12-19 08:54 GMT

బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ ఫైనలిస్టులు అభిజిత్, అఖిల్ ను ఆటపట్టించాడు. ఈ సీజన్ ముగింపు దశకు చేరుకోవటంతో కంటెస్టెంట్లు అంతా ఫైనల్ షో కోసం వెనక్కి వచ్చారు. హౌస్ లోకి వెళ్ళిన అవినాష్ సరదాగా అభిజిత్, అఖిల్ ను ఆటపట్టించి సందడి చేశాడు. 'మామూలుగా లేదు బయట అసలు.. అమ్మాయిలు అంతా నీ నెంబర్ అడుగుతున్నారు. ఇచ్చేయమంటావా.' అంటూ అభిని ఆటపట్టిస్తాడు. మళ్ళీ వెంటనే కవరింగ్ ఇస్తూ నా నెంబర్ అడుగుతున్నారు అమ్మాయిలు అంతా అంటూ చిన్న ఝలక్ ఇస్తాడు. మోనాల్ వచ్చిందా.? అని అఖిల్ అడిగిన అవినాష్ ..మరి కలిపినవా అంటూ ప్రశ్నిస్తాడు.

పులిహోర చేసే విధానం ముందు కావాల్సింది అఖిల్ అంటూ ఓ ఆటాడుకుంటాడు. అంతలోనే సమయం ముగిసిపోయింది..మీరు బయటకు వెళ్లాలి అంటూ బిగ్ బాస్ చెప్పటంతో అసలు ఎందుకు పిలుస్తారు..ఎందుకు బయటకు పంపిస్తారు..అసలు ఆ తలుపు తెరవొద్దు అంటూ ఒకింత కోపం ప్రదర్శించి ఆకట్టుకుంటాడు. నోయల్ కూడా వస్తూనే తన ర్యాప్ తో హంగామా చేయగా..హారిక నవ్వుతూ..బుగ్గలు వచ్చినయ్ నీకు అంటుంది. ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళిన గంగవ్వ, సుజాత, మొహబూబ్, దివి అంతా హౌస్ లో కాసేపు సందడి చేశారు. ఈ ఆదివారం 'బిగ్ షో'తో ఈ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది.

Full ViewFull View

Tags:    

Similar News