బిగ్ బాస్ ..సీక్రెట్ రూమ్ లో కి అఖిల్

Update: 2020-11-11 16:59 GMT

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో తొమ్మిది మంది ఉన్నారు. బుధవారం నాడు బిగ్ బాస్ కొత్త డ్రామాకు తెరతీశారు. హౌస్ లో ఉన్న సభ్యులు తమకు ఎవరు గట్టి పోటీ అనుకుంటారో వారి పేరు చెప్పాలని సూచించారు. అందరిని సూట్ కేసులు సర్దుకుని వచ్చి ఇందులో పాల్గొనమన్నారు. ఉన్న తొమ్మిది మందిలో ఏడుగురు అఖిల్ పేరు చెప్పారు. సహజంగా అయితే అంత మంది అఖిల్ గట్టిపోటీదారు అంటే హౌస్ లో ఉంచాలి కానీ..బయటకు పంపించటం ఏంటి అన్న చర్చ హౌస్ సభ్యుల్లోనే మొదలైంది. అయితే సభ్యుల్లో మెజారిటీ వాళ్ళు అఖిల్ పేరు చెప్పటంతో హౌస్ నుంచి బయటకు వచ్చేశారు.

అయితే బిగ్ బాస్ మాత్రం అఖిల్ ను సీక్రెట్ రూమ్ లో పెట్టి కొన్ని రోజులు అక్కడే ఉండాలన్నారు. అఖిల్ బయటకు వెళ్లిపోయాడన్న బాధలో మోనాల్ ఎప్పటిలాగానే ఏడుపు స్టార్ట్ చేసింది. అయితే విచిత్రం ఏమిటంటే బిగ్ బాస్ హౌస్ లో ఏమి జరగనుందనే విషయాలు అన్నీ ముందే సోషల్ మీడియాలో ఛల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఇది చూసే వారికి ఏదీ పెద్దగా ట్విస్ట్ అన్పించటం లేదు. ముందు సభ్యులు రకరకాల పేర్లు చెప్పారు. తర్వాత అందరూ కలసి అఖిల్ ను పంపారు. అయితే సభ్యులు కూడా మళ్లీ తిరిగి వస్తావనే చెప్పి పంపటం విశేషం.

Tags:    

Similar News