ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైత్యన్య జంటగా నటించిన బేబీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం దక్కించుకుంది. ఇప్పుడు ఇదే కాంబినేషన్ తో మరో సినిమా వస్తోంది. అదే ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ మూవీ. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. చిత్ర యూనిట్ బుధవారం నాడు ఎపిక్ మూవీ రిలీజ్ డేట్ తో న్యూ లుక్ ను విడుదల చేసింది. దీని ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ 11 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామాను తెరకెక్కించాడు.
Full Viewఅందమైన ప్రయాణాలు అతి సాధారణమైన క్షణాలతోనే ప్రారంభమవుతాయి అంటూ నిర్మాణ సంస్థ రిలీజ్ డేట్ పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఈ సినిమాకు చెందిన పాటలు, టీజర్‌కు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సినిమా కోసం ముందుగా అనుకున్న విడుదల తేదీలో అంటే సెప్టెంబర్ 11 న ఇప్పుడు ఆనంద్ దేవరకొండ మూవీ వస్తుండటం విశేషం. దీంతో విజయదేవరకొండ సినిమా విడుదల వాయిదాపడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ యూత్ ఫుల్ మూవీ కి హెషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.