విడాకుల వ్య‌వ‌హారంపై నాగార్జున సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2022-01-27 10:42 GMT

అక్కినేని నాగార్జున కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల విడాకుల‌పై పెద్ద‌గా ఎప్పుడూ మాట్లాడ‌ని నాగార్జున తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ముందు స‌మంతే విడాకులు కోరార‌ని..ఆమె నిర్ణ‌యాన్ని నాగ‌చైత‌న్య గౌర‌వించి సరేన‌న్నారు. నాగ‌చైత‌న్య త‌న కంటే నా గురించి, కుటుంబ ప‌రువు, మ‌ర్యాదలు ఏమ‌వుతాయోన‌ని ఆందోళ‌న చెందాడ‌ని నాగార్జున తెలిపారు.త‌న‌పై ఎన్ని అస‌త్య వార్త‌లు రాసినా ప‌ట్టించుకోను కానీ త‌న ఫ్యామిలీ గురించి నెగెటివ్‌గా రాయ‌డం బాధించింది అన్నారు.

విడాకుల ప్ర‌య‌త్నాలు తొలుత ఆమెనే మొద‌లుపెట్టింద‌ని, ఆమె నిర్ణ‌యాన్ని గౌర‌వించి చైత‌న్య విడాకుల‌కు అంగీక‌రించాడ‌ని తెలిపాడు. నిజానికి చైసామ్ ఎంతో అన్యోన్యంగా ఉండేవార‌న్న నాగ్‌.. నాలుగేళ్ల వివాహ‌బంధంలో విడిపోయేటంత పెద్ద స‌మస్యేంటో త‌న‌కు ఇప్ప‌టికీ తెలియ‌ద‌ని పేర్కొన్నాడు.గ‌తేడాది ఇద్ద‌రూ నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను క‌లిసే జ‌రుపుకున్నార‌ని, ఆ త‌ర్వాతే వారి మ‌ధ్య పొర‌ప‌చ్చాలు వ‌చ్చాయ‌ని తెలిపాడు. 

Tags:    

Similar News