ఏపీ అంబులెన్సులకు అనుమతి

Update: 2021-05-14 16:35 GMT

తెలంగాణ, ఏపీల మధ్య తలెత్తిన అంబులెన్స్ ల వివాదం పరిష్కారం అయినట్లే కన్పిస్తోంది. తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్ లను ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు మరోసారి ఈ వ్యవహారంలో తెలంగాణ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాకుండా సర్కారు జారీ చేసిన సర్కులర్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ఏపీ అంబులెన్సులకు అనుమతిస్తున్న పోలీసులు.. ఈ-పాస్ లేకున్నా అంబులెన్సులను ఆపడం లేదు.

సాయంత్రం వరకూ హైకోర్టు ఆదేశాల అందకపోవటంతో అనుమతి లేని వాహనాలను అడ్డుకోగా.. కోర్టు ఆదేశాలు అందడంతో తాజాగా పర్మిషన్ ఇస్తున్నారు. సూర్యాపేట జిల్లా రామాపురం చెక్ పోస్టు వద్ద కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా అంబులెన్స్ లను అనుమతిస్తున్నారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్లు అయింది. కరోనా పేషంట్లతో కూడిన అంబులెన్స్ లను ఆపటం వల్ల కొంత మంది మృత్యువాతపడ్డారు.

Tags:    

Similar News