ఆయన వకీల్ సాబ్ కాదు..షకీలా సాబ్

Update: 2020-12-29 07:43 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కాదు..షకీలా సాబ్ అని జనం అనుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు. పాల్..పవన్ కళ్యాణ్, చంద్రబాబు అంతా ఒకటేనని ఎద్దేవా చేశారు. పాల్ ను అంతర్జాతీయ అధ్యక్షుడిగా, చంద్రబాబు జాతీయ అధ్యక్షుడుగా, పవన్ కళ్యాణ్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఇదంతా తెలుగు సేన అన్నారు. పోటీచేసిన రెండు చోట్ల ఓడించి ప్రజలు అసెంబ్లీలోకి రానివ్వలేదని..ఆయన అసెంబ్లీ ముట్టడికి వస్తానంటే చూస్తూ ఊరుకుంటామా అని ప్రశ్నించారు. బోడిలింగం ఎవరు గాజువాక, భీమవరం ప్రజలు అడిగితే చెబుతారన్నారు. ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంత వ్యాపారం చేయవచ్చని చూపించిన ఆదర్శపుపురుషుడు ఆయన. వకీల్ సాబ్ అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమి తెలుసు అని ప్రశ్నించారు. ఇలాంటి యాక్టర్లు...పనికిమాలినవాళ్ళు రోడ్ల మీద చాలా మంది తిరుగుతుంటారు. వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

రాష్ట్రంలో పేకాట క్లబ్‌లు పెట్టమా.. లేక మూసివేశామో రాష్ట్ర ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పేకట క్లబ్‌లు పెట్టినప్పుడు ఆయన‌ పార్టనర్ ఎక్కడ వున్నాడు. ఎవరో ఇచ్చిన ప్యాకేజిలు తీసుకుని నోటి కోచ్చినట్లు మాట్లాడితే మంచిది కాదు. మేము కాదు నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది' అంటూ హెచ్చరించారు. 'గతంలో పవన్ కల్యాణే జగన్‌మోహన్‌రెడ్డి బాగా పరిపాలిస్తే రాజకీయాలు వదిలి సినిమాలు చేసుకుంటాను అని అన్నాడు. నువ్వు సినిమాలు చేసుకుంటే మాకేందుకు.. చేసుకోకపోతే మాకేందుకు. నిన్ను సినిమాలు మానేయ్యమని మేము అడగలేదు కదా. మేము ఇప్పుటికి నిన్ను ఒక సినిమా యాక్టర్‌గానే చూస్తున్నాం. నువ్వు సినిమాలు వదులుతావా లేక ఇంకా ఎవరినైనా వదులుతావా అని మేం అడగలేదు. ఏం వదలాలి అనేది నీ ఇష్టం.

ప్యాకేజీ వచ్చినట్లు ఉంది.. బయటకు వచ్చి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిని ఒక వైపు.. సొంత పుత్రుడుని ఓ వైపు జిల్లాలోకి నిన్న పంపించాడు. జోగిజోగి రాసుకుంటే బుడిద వస్తుంది అంటారు. అదే వచ్చింది' అంటూ నాని ఎద్దేవా చేశారు. 'ఏ మతమైన మాకు గౌరవం. పవన్ కల్యాణ్‌ ముక్కోటి లింగాలలో బోడి లింగం అని అంటున్నాడు. శివ లింగాలని బోడి లింగంగా సంబోధించడం ఆయన సంస్కారానికి అద్దం పడుతుంది. నీకు చేతనైతే చేసుకో అంటూ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ కు ఇప్పటి వరకూ ప వన్ కళ్యాణ్ కు మోడీ, అమిత్ షాలు అపాయింట్ ఇవ్వలేదని ఎధ్దేవా చేశారు. బిజెపి తిరుపతిలో పోటీచేస్తే టీడీపీ మూడవ స్థానానికి పడిపోతుంది. అందుకే చంద్రబాబును కాపాడేందుకే ఈ ఎత్తుగడ, నీ యాక్షన్ సినిమాల్లో చేసుకో..నాలుగు డబ్బులు వస్తాయి. ఇలా రోడ్ల మీదకు వచ్చి చేస్తే నాలాంటి వాళ్లతో తిట్లు తినటం తప్ప..ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నారు.

Tags:    

Similar News