వాళ్లిద్దరూ తెలియక చేశారేమో!

Update: 2025-01-27 12:42 GMT

దావోస్ డిజాస్టర్ ను కవర్ చేసుకోవటానికి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..ఇటు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ లు నానా తంటాలు పడుతున్నారు. ఈ చర్చను మళ్లించేందుకు ఇప్పటికే రాష్ట్రానికి 6 .33 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు...నాలుగు లక్షల పది వేలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి అని లెక్కలు చెపుతున్నారు. మొన్న చంద్రబాబు నాయుడు ఇవే లెక్కలు చెపితే...సోమవారం నాడు వైజాగ్ లో నారా లోకేష్ సైతం అదే పేజీ తో మాయ చేసే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు, నారా లోకేష్ చెప్పే ఉద్యోగాల లెక్కల్లో నిజం ఎంత ఉంది అని తరచి చూస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ అయిన ఎన్ టిపీసి లో 2024 నాటికీ ఉన్న మొత్తం ఉద్యోగులు 20074 మంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో లక్షా ఎనభైఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్న ఎన్ టిపీసి గ్రీన్ ఎనర్జీ లో పని చేస్తున్న ఉద్యోగులు సంఖ్య మొత్తం మూడు వందల మంది లోపే. కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు ఈ కంపెనీ రాష్ట్రంలో కొత్తగా తమ యూనిట్ ద్వారా 57 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్లు చెపుతున్నారు. ఇందులో ఏ మాత్రం వాస్తవం ఉండే అవకాశం లేదు అని అధికారులు చెపుతున్నారు.

                                                                          దీనికి ప్రధాన కారణం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల్లోనే ఉద్యోగులు కాస్త ఎక్కువ మంది ఉంటారు తప్ప...సోలార్, విండ్, ఇతర గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ల్లో ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది అని..అలాంటిది ఎన్ టిపీసి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ద్వారా ఏకంగా 57000 వేల మందికి ఉద్యోగాలు అన్నది ఏ మాత్రం నమ్మదగ్గ విషయం కాదు అని విద్యుత్ శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కంపెనీ కూడా అధికారికంగా పెట్టుబడి విషయాన్ని ప్రస్తావించింది కానీ...ఎక్కడ జాబ్స్ లెక్కలు వెల్లడించలేదు. మిట్టల్, నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగ లెక్కలపై కూడా పరిశ్రమల శాఖ అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ విచిత్రంగా బీపీసిఎల్ 97 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో మాత్రం కేవలం మూడు వేల మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయని చూపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు ఇద్దరు కూడా తాము ఏది చెపితే జనం అదే నమ్ముతారు...నమ్మాలి అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఈ సారి దావోస్ లో ఏపీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క ఎంఓయూ కూడా కుదుర్చులేకపోయింది.

                                                       దీన్ని కవర్ చేసుకోవటానికి దావోస్ ఒప్పందాలు చేసుకునే వేదిక కాదు..కనెక్టింగ్ ప్లేస్..పారిశ్రామిక వేత్తలతో చర్చ లకు వేదిక అంటూ కొత్త కొత్త అర్ధాలు చెపుతున్నారు. కాసేపు వీళ్లిద్దరు చెప్పేదే నిజం అనుకుందాం. కానీ వీళ్ళతో పాటు వెళ్లైనా మహారాష్ట్ర సర్కారు ..ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో అదే దావోస్ వేదికగా దగ్గర దగ్గర 16 లక్షల కోట్ల రూపాయల మేర ఒప్పందాలు చేసుకుంది. మరో వైపు తెలంగాణ కూడా 1 .79 లక్షల కోట్ల రూపాయల మేర ఎంఓయూ లు చేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు లు కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఎక్కడ వరకో ఎందుకు ఇదే చంద్రబాబు గతంలో దావోస్ లో పలు ఎంఓయూలు కుదుర్చుకుని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఈ సారి ఒక్క ఎంఓయూ కు ఛాన్స్ లేకపోవటంతో రకరకాల లెక్కలు చెప్పి.సోషల్ మీడియా లో ప్రహకారం చేసుకుంటూ ఫెయిల్యూర్ ను కవర్ చేసుకునే పనిలో ఉన్నారు.

Tags:    

Similar News