పెరిగిన ఇంథన డిమాండ్

Update: 2020-10-10 15:08 GMT

ఈ ఏడాది జూన్ తర్వాత సెప్టెంబర్ లో ఇంథన డిమాండ్ పెరిగింది. వరస పెట్టి లాక్ డౌన్ నిబంధనల సడలింపులు ఇస్తుండటంతో ఇంథన డిమాండ్ ఊపందుకుంటోంది. సెప్టెంబర్ నెలలో రిఫైన్ చేసిన ఇంథన వినియోగం 7.2 శాతం పెరిగి 15.47 మిలియన్ టన్నులకు చేరిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే 2019 సెప్టెంబర్ తో పోలిస్తే మాత్రం డిమాండ్ 4.4 శాతం మేర తగ్గింది. డీజిల్ వినియోగం 13.2 శాతం వృద్ధితో 5.49 మిలియన్ టన్నులకు చేరింది. ఆగస్టులో ఇది 4.85 మిలియన్ టన్నులుగా ఉంది.

 

Similar News