వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు

Update: 2020-09-20 10:57 GMT

దేశ వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు ప్రకటించింది. రాజ్యసభలో ఆ పార్టీ పక్ష నేత విజయసాయిరెడ్డి ఈ బిల్లులపై మాట్లాడుతూ ఈ బిల్లుల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర దొరుకుతుందని ప్రకటించారు. గతంలో రైతులు దళారీలు దయాదాక్షిణ్యాలపై బతికేవారన్నారు. నచ్చినచోట పంట అమ్ముకోవటం వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన బిల్లులు రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యయసాయ బిల్లులకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్టుగా వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి ప్రకటించారు. రైతు బిల్లులపై కాంగ్రెస్ తీరును ఆయన తప్పుపట్టారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాలనే ఎన్డీయే బిల్లుగా తీసుకువచ్చిందన్నారు. కాంగ్రెస్ ఆత్మవంచన మానుకోవాలని విజయసాయి హితవుపలికారు. మధ్య దళారులకు కాంగ్రెస్ అండగా నిలబడుతోందని ఆయన వ్యాఖ్యానించడంతో సభలో గందరగోళం తలెత్తింది.

Similar News