కరోనాతో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి

Update: 2020-09-16 13:25 GMT

షాకింగ్. కరోనాతో తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ తుది శ్వాస విడిచారు. ఆయన తిరుపతి నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన కరోనాకు చికిత్స పొందుతున్నారు. బల్లి దుర్గాప్రసాద్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 28 ఏళ్ళకే తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి ఎంపీగా గెలిచారు. బల్లి దుర్గాప్రసాద్, మరో ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అదాల ప్రభాకర్ రెడ్డితోపాటు ఆయన కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరారు.

 

Similar News