ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్

Update: 2020-09-21 04:22 GMT

రాజ్యసభలో సోమవారం నాడు కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. వ్యవసాయ బిల్లులను సభ ఆమోదించిన తీరుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే విపక్ష సభ్యులను తీరుపై రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేశారు. సభ్యులెవరైనా నియమాలు పాటించాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో జరిగిన గొడవపై కఠిన చర్యలు తీసుకున్నారు.

ఎనిమిది మంది సభ్యులను సభ మిగిలిన కాలానికి సస్పెండ్ చేశారు. అనంతరం వీరిని సభ నుంచి బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. సస్పెన్షన్ కు గురైన వారిలో డెరెక్ ఓబ్రెయిన్, సంజయ్ సింగ్, రాజీవ్ సతావ్, కె కె రాగేష్, సయ్యద్ నాసిర్, రిపున్ బోరా, దోలా సేన్, ఎలమారాం కరీం ఉన్నారు. ఎంపీల సస్ఫెన్షన్ పై విపక్ష సభ్యుల ఆందోళనతో సభ వాయిదా వేశారు.

 

Similar News