బెంజ్ కారు మంత్రిని రక్షిస్తున్న జగన్

Update: 2020-09-24 06:47 GMT

‘మీ మంత్రి దొంగ అని తెలిసిపోయిందా?. ఏసీబీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోరా?. మేం ఆరోపణలు చేయటం లేదు. ఆధారాలు కూడా చూపిస్తున్నాం. అయినా సీఎం జగన్ స్పందించటం లేదంటే మంత్రిని రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లు కన్పిస్తోంది’ అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఆయన గురువారం నాడు విశాఖపట్నంలో ఏసీబీ కార్యాలయంలో మంత్రి గుమ్మనూరు జయరామ్ కుమారుడికి అందిన బెంజ్ కారుకు సంబంధించిన అంశంపై ఫిర్యాదు చేశారు.

తాము ఆధారాలు బయటపెట్టి వారం రోజులు దాటిందని..అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవటంతో ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఏసీబీ కూడా స్పందించకపోతే తమ ఎమ్మెల్యేలు , సీనియర్ నేతలు గవర్నర్ ను కలసి ఫిర్యాదు చేస్తారని తెలిపారు. కోటి రూపాయల విలువైన బెంజ్ కారును ఏ ప్రయోజనం ఆశించకుండా ఎవరైనా ఓ మంత్రి కుమారుడికి ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు అయ్యన్నపాత్రుడు.

Similar News