సీఎం జగన్ తో అలీ భేటీ

Update: 2020-09-16 13:08 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో నటుడు అలీ భేటీ అయ్యారు. బుధవారం నాడు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో ఈ భేటీ జరిగింది. జగన్ తో సమావేశం అనంతరం అలీ మీడియాతో మాట్లాడారు. మర్వాదపూర్వంగానే సీఎంను కలసినట్లు తెలిపారు. సినిమా పరిశ్రమ గురించి జగన్ వాకబు చేశారని..షూటింగ్ లు ప్రారంభించటానికి ఇంకా కొంత సమయం పడుతుందని సీఎంకు వివరించానని తెలిపారు. సీఎం జగన్ దేశంలో బెస్ట్ సీఎంగా నిలుస్తారని అలీ వ్యాఖ్యానించారు. చిన్న వయసులో ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారని తెలిపారు.

Similar News