కెసీఆర్..కెటీఆర్ ల అపాయింట్ మెంట్ కోసం నెలలుగా ఎదురుచూస్తున్నా

Update: 2020-08-30 11:30 GMT

టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులను పట్టించుకోవటంలేదు

టీఆర్ఎస్ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉద్యమకారులను ఎవరూ పట్టించుకోవటంలేదని ఆరోపించారు. సీఎం కెసీఆర్, మంత్రి కెటీఆర్ ల అపాయింట్ మెంట్ కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. స్వామిగౌడ్ ఓ ఛానల్ తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీసీలకు అన్యాయం జరుగుతుందనే మాటను తాను గతంలోనూ చెప్పానని..ఇప్పుడూ చెబుతున్నానని పేర్కొన్నారు. ఛైర్మన్ గా పదవిలో ఉన్న సమయంలో ఆ పదవి గౌరవాన్ని కాపాడుకుంటూనే ఇదే మాట చెప్పానన్నారు. బీసీలనను బలహీనవర్గాలు..బలహీనవర్గాలు అంటారు అని..కానీ బీసీల్లోని చాలా కులాలు ఆర్ధికంగా బలహీనమే కానీ..బలంపరంగా బలహీనవర్గాలు కాదని వ్యాఖ్యానించారు. బీసీల్లో చాలా బలమైన కులాల వాళ్లు ఉన్నారని తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను గమనించమని..చేరదీయమని చెబుతున్నట్లు తెలిపారు.

‘ఇప్పుడు మీరు చేరదీసింది ఎవరిని?. ఆప్యాయంగా గౌరవంగా కండువాలు కప్పింది ఎవరికి?. మీ నాయకత్వంలో మేం పనిచేసినప్పుడు మా మీద కేసులు పెట్టిన వారిని..మమ్మల్ని తొక్కిన వారిని. ఎన్నడూ ఉద్యమం చేయనోడు..ఆ నియోజకవరంగంలో తెలంగాణ ఉద్యమకారునుల అణచివేయటం బాధాకరం. రైలు పట్టాల మీద తలపెట్టిన వారు ఎమ్మెల్యే ఇళ్ళ ముందు బిచ్చగాళ్లలా నించుంటున్నారు. ఛైర్మన్ గా ఉన్నప్పుడు కూడా గతంలో ఈ విషయం చెప్పినా. నేను మీరిచ్చిన పోరాటం చేసిన వ్యక్తిని. నేను పార్టీ మారే ప్రసక్తి లేదు..పార్టీపై నాకెలాంటి కోపం లేదు. కేంద్ర, రాస్ట్ర ప్రభుత్వాలు తనను చంపేందుకు ప్రయత్నించినా కూడా తాను కెసీఆర్ మాట మీద నిలబడి పోరాటం చేశానని తెలిపారు.

Similar News