సుశాంత్ మరణంపై సీబీఐ విచారణకు సుప్రీం ఓకే

Update: 2020-08-19 06:14 GMT

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారంపై గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేగుతోంది. ఈ వ్యవహారం బీహార్, మహారాష్ట్రల మధ్య పెద్ద సమస్యగా కూడా మారింది. బీహార్ సర్కారు వినతిపై సుశాంత్ మరణంపై కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించగా..మహారాష్ట్ర మాత్రం ముందు ముంబయ్ పోలీసుల విచారణపై నమ్మకం ఉంచాలని వాదిస్తూ వచ్చింది. ఈ తరుణంలో సుప్రీంకోర్టు బుధవారం నాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ కు విచారణ ఇచ్చింది. ఈ విచారణకు మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఆదేశించింది. సుశాంత్ మరణానికి సంబంధించి సేకరించిన అన్ని ఆధారాలను బీహార్ పోలీసులకు అప్పగించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.

సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి కూడా ఈ కేసును బీహార్ పోలీసులు కాకుండా మహారాష్ట్ర పోలీసులే విచారణ జరపాలని కోరింది. అవసరం అయితే సీబీఐ ఈ కేసుకు సంబంధించి కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. బాలీవుడ్ లో వేళ్ళూనుకుపోయిన బంధుప్రీతే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణమని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అంతే కాదు..సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని..ఇది హత్య అంటూ గత కొన్ని రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. సుప్రీంకోర్టు తాజాగా సీబీఐ విచారణకు ఆదేశించటంతో ఇక ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.

Similar News