జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. గురువారం నాడే చిరంజీవితో కూడా వీర్రాజు భేటీ అయిన సంగతి విదితమే. ఏపీలో బిజెపి, జనసేనల మధ్య పొత్తు ఉన్న విషయం తెలిసిందే.
రాబోయే రోజుల్లో రెండు పార్టీలు కలసి ప్రజా సమస్యలపై ఉద్యమించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో పాటు అమరావతి రైతులకు ఎలా న్యాయం చేయాలనే అంశంపై కూడా వీరిద్దరూ చర్చించినట్లు చెబుతున్నారు.