నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకుని ఆయన విధుల్లో చేరారు. హైకోర్టు ఆదేశాలు..గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ జోక్యంతో ఏపీ సర్కారు ఆయనకు తిరిగి నియామక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అనంతరం తలెత్తిన వివాదంలో ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి రమేష్ కుమార్ పదవీ కాలం ముగిసేలా చేయటం..ఈ ఆర్డినెన్స్ లను రమేష్ కుమార్ హైకోర్టులో సవాల్ చేయటంతో హైకోర్టు ఆర్డినెన్స్ లను కొట్టివేసిన సంగతి తెలిసిందే.