సాయి తేజ్ తన కొత్త సినిమా ‘సోలో బతుకే సో బెటర్’ సినిమాకు సంబంధించి కొత్త అప్ డేట్ ఇఛ్చాడు. దీనికి సంబంధించి ఈ హీరో శనివారం నాడు చేసిన ట్వీట్ తో అందరూ సాయి తేజ్ కూడా ఓ ఇంటి వాడు కాబోతున్నాడు అనుకున్నారు. తీరా సీన్ కట్ చేస్తే ఇది సినిమా అప్ డేట్ అని తేలిపోయింది.
కొత్త సినిమాకు సంబంధించి ‘ఇది నేనేనా’ పాటను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సుబ్బు దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రమిది. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో సాయితేజ్ కు జోడీగా నభా నటేష్ నటిస్తున్నారు.