తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. జులై 29న అనారోగ్యంతో ఆయన నిమ్స్ లో చేరారు. చేరిన తర్వాత జరిపిన పరీక్షల్లో ఆయనకు కరోనా ఉన్నట్లు తేలింది. చికిత్స పొందుతూ శనివారం ఉదయం 10.30 గంటలకు తుది శ్వాస వదిలారు.
నంది ఎల్లయ్య ఆరు సార్లు లోక్ సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. నంది ఎల్లయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కెసీఆర్ తోపాటు తెలంగాణకు చెందిన పలువురు నేతలు సంతాపం తెలిపారు.