అల్లు అర్జున్ న్యూలుక్

Update: 2020-08-20 15:33 GMT

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా అన్ని సినిమాల తరహాలోనే ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ లు పడ్డాయి. అల్లు అర్జున్ తాజాగా హైదరాబాద్‌లోని తమ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వచ్చాడు. చాలా రోజుల తర్వాత అక్కడికి వచ్చిన బన్నీని చూసి అభిమానులు కూడా ఫుల్ కుష్. అయితే బన్నీ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఎప్పట్లా ఆఫీస్ లో సందడి కనిపించడం లేదంటూ బాధ పడ్డాడు బన్నీ. ఇదే విషయాన్ని ట్వీట్ చేశాడు. చాలా కాలం తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లాను.. అక్కడ ఎలాంటి సందడి కనిపించలేదు.. కరోనాతో ఏర్పడిన ఈ గడ్డు పరిస్థితులు త్వరలోనే అంతం కావాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేసాడు అల్లు అర్జున్.

Similar News