సచిన్ పైలట్ గ్రూప్ కు ఊరట

Update: 2020-07-21 10:26 GMT

రాజస్థాన్ లో రాజకీయ డ్రామా కొనసాగుతూనే ఉంది. హైకోర్టు ఈ కేసుపై తీర్పును జులై 24కి వాయిదా వేసింది. అదే సమయంలో సచిన్ పైలట్ తోపాటు ఆయన గ్రూప్ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని స్పీకర్ ను కోర్టు ఆదేశించింది. దీంతో అసమ్మతి వర్గానికి మరో మూడు రోజులు ఊరట లభించినట్లు అయింది. పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలతో మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ క్యాంప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వీరందరికీ రాజస్థాన్ స్పీకర్ నోటీసులు జారీ అనర్హత వేటు ఎందుకు వేయకూడదో తెలపాలని కోరారు.

ఈ నోటీసులపై పైలట్ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. సభా కార్యక్రమాలకు విప్ వర్తిస్తుంది కానీ..పార్టీ సమావేశాలకు విప్ వర్తించదని పైలట్ వర్గం తరపున కోర్టులో వాదనలు విన్పించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును ఈ నెల 24కి వాయిదా వేసింది. దీంతో రాజకీయ అనిశ్చితి మరికొన్ని రోజులు కొనసాగనుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ల మధ్య వివాదాలు తీవ్ర రూపం దాల్చాయి.

Similar News