తెలంగాణలో కరోనా టెస్ట్ లకు సంబంధించి నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్ లోని ప్రైవేట్ ల్యాబ్ లు టెస్ట్ లు నిలిపివేశాయి. ఈ నెల5 వరకూ కొత్తగా ఎలాంటి శాంపిళ్ళను తీసుకోమని అవి ప్రకటించాయి. ప్రభుత్వం కూడా ప్రైవేట్ ల్యాబ్ ల్లో టెస్ట్ లకు సంబంధించి పలు ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తోంది.
కేంద్ర బృందం కూడా ప్రైవేట్ ల్యాబ్ ల్లోని టెస్ట్ లపై అసంతృప్తి వ్యక్తం చేసిందని చెబుతున్నారు. అయితే సరైన శిక్షణ తర్వాత జులై 5 నుంచి తిరిగి ప్రైవేట్ ల్యాబ్ లు టెస్ట్ లు చేస్తాయని చెబుతున్నారు. సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వటంతోపాటు ల్యాబ్ లను కూడా డిస్ ఇన్ ఫెక్షన్ చేయించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.