నితిన్ కు పవన్ శుభాకాంక్షలు

Update: 2020-07-24 14:46 GMT

హీరో నితిన్ పెళ్లి వేడుకులు నగరంలోని ఓ ప్రముఖ హోటల్ లో సాగుతున్నాయి. ఈ ఆదివారం రాత్రి నితిన్, షాలినీల పెళ్ళి జరగనుంది. కోవిడ్ 19 కారణంగా పరిమిత సంఖ్యలోనే ఇరు కుటుంబాల సమక్షంలోనే పెళ్లి వేడుక జరగనుంది. దీంతో శుక్రవారం నాడే ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ , నిర్మాత రాధాకృష్ణలు నితిన్ ను కలసి శుభాకాంక్షలు తెలిపారు. తనకు వివాహ శుభాకాంక్షలు తెలియజేసేందుకు స్వయంగా వచ్చిన పవర్‌ స్టార్‌, త్రివ్రిక్రమ్‌, చినబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘పెళ్లి కొడుకు ఫంక్షన్‌కు హాజరై విషెస్‌ తెలిపిన ముగ్గురు అతిథులకు చాలా చాలా థాంక్స్‌’ అంటూ నితిన్‌ ట్వీట్‌ చేశారు.

Similar News