సచివాలయం కూల్చివేతకు జులై 15 వరకూ బ్రేక్

Update: 2020-07-13 08:38 GMT

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు సంబంధించి హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. అప్పటివరకూ కూల్చివేత పనులను కూడా ఆపేయాలని ఆదేశించింది. ప్రభుత్వం సచివాలయం కూల్చివేతకు సంబంధించి హైకోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే కేబినెట్ నిర్ణయాన్ని సీల్డ్ కవర్ లో అందజేయాలని హైకోర్టు కోరింది.

అయితే సోమవారం సాయంత్రంలోగానే అందిస్తామని అడ్వకేట్ జనరల్ తెలిపారు. గతంలో సచివాలయానికి సంబంధించిన డిజైన్ల విషయంలోనూ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని..కూల్చివేతపై కేబినెట్ నిర్ణయం ఉంటే ఆ వివరాలు కూడా అందజేయాలని హైకోర్టు ఆదేశించింది.

 

Similar News