ప్రజలు రాజ్ భవన్ ను ముట్టడిస్తే మా బాధ్యతలేదు

Update: 2020-07-24 11:13 GMT

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాజస్ధాన్ ప్రజలు రాజ్ భవన్ ఘోరావ్ కు పిలుపునిస్తే తాము ఏమీ చేయలేమన్నారు. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకునేందుకు తాను సిద్ధం అని..తనకు పూర్తి మెజారిటీ ఉందని ఆయన తెలిపారు. అంతే కాదు ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్లి గవర్నర్ కల్ రాజ్ మిశ్రాతో సమావేశం అయ్యారు. బలనిరూపణకు వీలుగా సోమవారం నాడు అసెంబ్లీని సమావేశపర్చాలని గెహ్లాట్ గవర్నర్ ను కోరారు. అయితే అందుకు ఆయన సిద్ధంగా లేరని.బహుశా ఉన్నతస్థానాల నుంచి ఒత్తిడి ఉన్నట్లు ఉందని వ్యాఖ్యానించారు.

శుక్రవారం నాడు రాజస్ధాన్ హైకోర్టు సచిన్ పైలట్ వర్గంపై అనర్హత వేటు వేయవద్దని చెబుతూ కేంద్రాన్ని కూడా ఈ కేసులో భాగస్వామిని చేస్తూ వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇలా కాలం గడిచే కొద్ది ప్రభుత్వానికి సమస్యలు వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. కారణాలు ఏమైనా ఈ పీఠముడి మాత్రం అలా సాగుతూనే ఉంది. ఈ లోగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటివో పాత కేసుల పేరు చెప్పి సీఎం సన్నిహితుల ఇళ్ళపై రకరకాల దాడులు చేయిస్తోంది.

Similar News