ఏపీ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇళ్ళ పట్టాల పంపీణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జులై8న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలని తలపెట్టారు. కానీ ఏపీలో కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉండటంతో సర్కారు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. గతంలోనూ ఓ సారి ఇదే కారణంతో వాయిదా పడింది. ఇప్పుడు ఆగస్టు 15న ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని యోచిస్తున్నారు. అప్పటి పరిస్థితులను బట్టే ఈ నిర్ణయం ఉండే అవకాశం ఉంది.