ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలో కొత్తగా ఇద్దరిని తీసుకోనున్నారు. మంత్రులుగా ఉండి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబో స్ ల స్థానంలో కొత్తగా ఇద్దరికి చోటు దక్కనుంది. కొత్తగా మంత్రి బెర్తులు ఎవరికి దక్కుతాయనే అంశంపై రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వాస్తవానికి సీఎం జగన్ రెండున్నర సంవత్సరాల తర్వాతే తన మంత్రివర్గంలో మార్పులు చేస్తానని తొలుత ప్రకటించారు. ఐదేళ్లలో సగం కాలం కొంత మందికి..మిగిలిన సగం అంటే ఎన్నికల టీమ్ గా కొత్త వారికి అవకాశం ఇస్తానని ప్రకటించారు. కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రెండు ఖాళీలను భర్తీకే ఈ విస్తరణ పరిమితం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.