భారతక్కగా ‘ప్రియమణి’

Update: 2020-06-04 07:18 GMT

బుల్లితెరపైనే ఎక్కువ సందడి చేస్తున్న ప్రియమణి ఇప్పుడు వెండితెరపై సందడికి రెడీ అయ్యారు. దగ్గుబాటి రానా హీరోగా తెరకెక్కుతున్న ‘విరాటపర్వం’ సినిమాలో ప్రియమణి కీలక పాత్ర పోషిస్తున్నారు. గురువారం నాడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ భారతక్కగా ప్రియమణి లుక్ ను విడుదల చేసింది. ఈ సినిమా మావోయిస్టుల బ్యాగ్రౌండ్ తో తెరకెక్కుతున్నట్లు కన్పిస్తోంది. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న సాయిపల్లవి లుక్ కూడా ఇదే తరహాలో వెలువడింది. ఇప్పుడు ప్రియమణి వంతు వచ్చింది.

వేఢు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటివరకూ ఎక్కువ శాతం గ్లామర్ పాత్రలకే పరిమితం అయిన ప్రియమణి ఈ సారి డిఫరెంట్ లుక్ లో కన్పిస్తోంది. అది కూడా భుజానికి ఓ బ్యాగ్, గన్ తగలించుకుని మావోయిస్టుగా కన్పిస్తోంది. ఈ సినిమాలో ప్రియమణి పాత్ర చాలా కీలకం అని చిత్ర యూనిట్ చెబుతోంది.

Similar News