రమ్యకృష్ణ కారులో మద్యం కలకలం

Update: 2020-06-13 13:43 GMT

రమ్యకృష్ణ. ఒకప్పటి టాప్ హీరోయిన్. ఇఫ్పుడు ప్రముఖ నటి. అసలు ఆమె కారులో మద్యం ఏంటి?. ఏదో ఒకటి అరా బాటిల్ అంటే ఎవరో పెట్టారనుకోవచ్చు. కానీ బాటిళ్ళకు బాటిళ్ళు కారులో దొరకటం అంటే అది ఖచ్చితంగా సరఫరా కిందే లెక్క. అయితే ఈ వ్యవహారంతో ఆమె పేరు తెగ ప్రచారంలోకి వచ్చింది. దీనికి కారణం ఆ కారు రమ్యకృష్ణది కావటమే.

చెన్నయ్ లోని ఈసీఆర్ రోడ్డులో కానత్తూర్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండ‌గా, రమ్యకృష్ణకు చెందిన ట‌యోటా ఇన్నోవా క్రిస్టా కారు (TN07Q 0099) వ‌చ్చింది. అందులోనే భారీగా మద్యం ప‌ట్టుబ‌డింది. పోలీసుల తనిఖీల్లో 96 బీర్ బాటిల్స్, 8 లిక్క‌ర్ సీసాలు గుర్తించారు. దీంతో వెంట‌నే ఆమె వాహ‌న డ్రైవ‌ర్ సెల్వకుమార్ ని అదుపులోకి తీసుకున్నారు.

Similar News