ఏపీలో మరో ఏడాది ఐదు రోజుల పని దినాలే

Update: 2020-06-26 15:53 GMT

సచివాలయంతో పాటు హెచ్ వోడీ కార్యాలయాల్లో పనిచేస్తే ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పని దినాలను మరో ఏడాది పొడిగించారు. ఈ మేరకు శుక్రవారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జీవో జారీ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ నుంచి ఉద్యోగులు హడావుడిగా ఏపీకి వెళ్లాల్సి రావటంతో ఉద్యోగులకు వెసులుబాటు ఇచ్చేందుకు ఐదు రోజుల పని దినాలను ప్రకటించారు. ప్రతి ఏటా దీన్ని పొడిగిస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది ఉద్యోగుల కుటుంబాలు హైదరరాబాద్ లో ఉండటం వంటి కారణాలతో ఈ వెసులుబాటును పొందారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం వినతిపత్రం మేరకు సర్కారు తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

Similar News