మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బాలయ్య నిండు నూరేళ్ళ సంబరం జరుపుకోవాలని ఆకాంక్షించారు.‘60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకు షష్టిపూర్తి శుభాకాంక్షలు. ఇదే ఉత్సాహంతో..ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ల సంబరం జరుపుకోవాలి. అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.