విశాఖలో విజయసాయిరెడ్డి బస

Update: 2020-05-12 04:01 GMT

ఐదు రోజుల గ్యాప్ తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు. అంతే కాదు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ఫాక్టరీ పరిసరాలలోని గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో ప్రజలకు మనోధైర్యాన్ని ఇచ్చేందుకు కటాపురంలోని ఒక ఇంట్లో ఆరు బయట నిద్రించారు. మంత్రులు కూడా ఇలాగే నిద్రకు ఉపక్రమించారు. విశాఖలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘ఇక్కడ సాదరణ పరిస్థితి నెలకొంది. ఇక్కడ నీరు కలుషితం అయినట్లు అనుమానాలు ఉన్నాయి..దీనిపై నిపుణులు టెస్ట్ లు చేస్తున్నారు.

రిపోర్టు లు వచ్చె వరకు ఇక్కడ నీటిని వినియోగించకూడదు. కొన్ని ప్రభావిత గ్రామలను ప్రభుత్వం చేర్చలేదన్నారు..వాటిపై కుడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కొన్ని గ్రామాలు పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నాయి. స్టైరిన్ ప్రభావం ఆ గ్రామం లో ఎలా ఉందో చూడాలి నేటి గ్రామ వాలంటీర్ ద్వారా ఇంటింట సర్వే చేస్తాం. ప్రజలు ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు పరిలీస్తాము కంపెనీ తరలించాలని కొందరు అంటున్నారు..ఉంచాలని కొందరు అంటున్నారు..హైపర్ కమిటీ నివేదిక వచ్చాక ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది’ అని తెలిపారు.

 

Similar News