‘లాక్ డౌన్’పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

Update: 2020-05-26 07:18 GMT

దేశంలో కరోనా వైరస్ పెరుగుతున్న తరుణంలో లాక్ డౌన్ సడలింపులు ఇఛ్చిన తొలి దేశం మనదే అని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దేశంలోలాక్ డౌన్ విఫలమైందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. లాక్ డౌన్ ఉద్దేశం, లక్ష్యం నెరవేరలేదన్నారు. వైరస్ ఉధృతి తగ్గుముఖం పడుతోందని కేంద్రం చెబుతుంటే పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు.

రాహుల్ గాంధీ వీడియో కాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు కేంద్రం సాయం చేయటంలేదని ఆరోపించారు. లాక్ డౌన్ ఫలితాలను ఇప్పుడు అందరూ చూస్తున్నారని అన్నారు. రాష్ట్రాలు ఒంటరిగానే కరోనాపై పోరాడుతున్నాయని వ్యాఖ్యానించారు. వలస కూలీల విషయంలో కేంద్రం ఎలా వ్యవహరించిందో అందరూ చూశారని విమర్శించారు.కూలీలకు ఆసరా లేకుండా చేశారని విమర్శించారు.

 

Similar News