ప్రజలు కలసి రావాలి..కెటీఆర్

Update: 2020-05-17 15:31 GMT

ఓ వైపు కరోనా..మరో వైపు దగ్గరకొస్తున్న వర్షాకాలం. వర్షాకాలం అంటే సీజనల్ వ్యాధుల టెన్షన్. గత ఏడాది హైదరాబాద్ లో డెంగ్యూ పీవర్ ప్రజలకు చుక్కలు చూపించింది. ఎంతలా అంటే హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా బెడ్స్ కూడా దొరకనంతగా విషజ్వరాలు ప్రజలను పీడించాయి. ఈ సారి తెలంగాణ సర్కారు ముందే అప్రమత్తం అయింది. దీని కోసం ఓ కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. ఈ అంశంపై తెలంగాణ పురపాలక, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ ప్రజా ప్రతినిధులకు లేఖ రాశారు. సీజనల్‌ వ్యాధుల బారినుంచి కుటుంబాలను, పట్టణాలను, ప్రజలను కాపాడుకోవాలని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఈ మేరకు ఆయన ఆదివారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పోరేషన్ ఛైర్మన్లు, మున్సిపల్ ఛైర్ పర్సన్లకు లేఖ రాశారు. ‘‘ ప్రతి ఆదివారం- పది గంటలకి- పది నిమిషాలు’’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వారికి పిలుపునిచ్చారు. పురపాలక శాఖ చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలన్నారు. సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు పకడ్బందీ ప్రణాళికతో పురపాలక శాఖ ముందుకు వెళ్తోందని తెలిపారు. పురపాలక శాఖ కార్యక్రమాలతో కలిసి రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Similar News