ఏపీలో మరో 60 కరోనా కేసులు

Update: 2020-05-06 05:47 GMT

గడిచిన 24 గంటల్లో ఏపీలో మరో 60 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇందులో 12 మంది గుజరాత్ కు చెందిన వారు ఉన్నారు. మరో కేసు కర్ణాకటకు చెందిన వ్యక్తి. తాజా కేసులు కలుపుకుంటే ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1777కు పెరిగింది. ఇందులో 729 మంది ఇఫ్పటికే డిశ్చార్జి అయ్యారు. మొత్తం 36 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1012 మంది.

గత ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా గుంటూరులో 12, కృష్ణాలో 14, కర్నూలులో 17, కడపలో 1, తూర్పు గోదావరిలో 1, విశాఖపట్నంలో 2 కేసులు నమోదు అయ్యాయి. 7782 శాంపిళ్ళను పరీక్షించినట్లు హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. గత ఇరవై నాలుగు గంటల్లోనే 140 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు వ్యక్తులు మరణించారు.

Similar News