ఆదాయమా..ప్రజల ఆరోగ్యం ముఖ్యమా?

Update: 2020-05-04 11:14 GMT

ఏపీలో మద్యం దుకాణాల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరటాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆక్షేపించారు. ప్రభుత్వం సరైన విధంగా వ్యవహరించకపోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. ప్రభుత్వానికి ఆదాయం ముఖ్యమా..ప్రజల ఆరోగ్యం ముఖ్యామా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీలో వైన్ షాపుల వద్ద పెద్ద పెద్ద క్యూలతో నిండిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన చంద్రబాబు ఎలాంటి భౌతికదూరం లేకుండా ఇలా చేయటం వల్ల కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మద్యం ధరల పెంపును కూడా టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తప్పుపట్టారు. ఇది ప్రజల రక్తాన్ని పీల్చటమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం కంపెనీలకే మేలు చేసి పెట్టేందుకు ధరలు పెంచారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో చెత్త బ్రాండ్లను అమ్ముతూ సర్కారు దోపిడీకి పాల్పడుతోందని యనమల మండిపడ్డారు.

 

 

Similar News