బాలకృష్ణ ఇంత వరకూ తెలుగులో ఏ హీరో చేయని సాహసం చేయనున్నారా?. అంటే ఔననే వార్తలు విన్పిస్తున్నాయి. అది కూడా భయపెట్టే పాత్రలో కన్పించనున్నట్లు దర్శకుడు బోయపాటి శ్రీను ధృవీకరించారు. వీరిద్దరి కాంబినేషన్ లో కొత్త సినిమా ఇఫ్పటికే ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే ఇందులో బాలకృష్ణ అఘోరాగా కన్పించనున్నట్లు తెలిపారు.
‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా కావటంతో బాలయ్య అభిమానులు దీనిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అంతే కాదు దర్శకుడు బోయపాటి శ్రీను కూడా గత రెండు సినిమాల కంటే ఇది మరింత హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓ షెడ్యూల్ పూర్తయిన తర్వాత కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.