ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. కొత్తగా వచ్చే కేసుల్లో ఎక్కువ శాతం తమిళనాడులోని కోయంబేడు లింక్ లతో కూడినవే ఉన్నాయి. తాజాగా వచ్చిన కేసులతో కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2100కు చేరింది. గత 24 గంటల్లో చిత్తూరులో 9, గుంటూరులో 5, కడపలో 2, కృష్ణాలో 2, నెల్లూరులో 15, శ్రీకాకుళంలో 2, పశ్చిమ గోదావరిలో ఒక కేసు వెలుగుచూశాయి. ఇఫ్పటికే 1192 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా..రాష్ట్రంలో ప్రస్తుతం 860 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇఫ్పటివరకూ కరోనా కారణంగా 48 మంది మరణించారు.