
ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే ఎస్ఈసీ రమేష్ కుమార్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు తాను వెంటనే బాధ్యతలు స్వీకరించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. అంతే కాదు తాను తన బాధ్యతలను నిష్పక్షపాతంగా, అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తానని తెలిపారు. దీని కోసం అన్ని పార్టీలతోపాటు భాగ్వస్వాములు అందరితో చర్చిస్తానని వెల్లడించారు.
సాదారణ పరిస్థితులు నెలకొన్న వెంటనే పని ప్రారంభిస్తానని తెలిపారు. వ్యక్తులు శాశ్వతం కాదు..వ్యవస్థలు..వాటి విలువలే శాశ్వతం అని రమేష్ కుమార్ తన ప్రకటనలో పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణ స్వీకారం చేసిన వారు ఆయా సంస్థల ప్రతిష్టను, సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.