ఏపీలో ఒక రోజులో జరిగిన శాంపిళ్ళ పరీక్షలు 10292. కొత్తగా వెలుగుచూసిన కేసులు 67. గత కొన్ని రోజులుగా వస్తున్నట్లే ఈ సారి కూడా అంటే సోమవారం నాడు కూడా కర్నూలులోనే అత్యధిక కేసులు. కర్నూలులో మరోసారి 25 కేసులు వెలుగుచూశాయి. గుంటూరులో 19 కేసులు నమోదు అయ్యాయి. కృష్ణాలో 12, కడపలో 4, చిత్తూరులో 1 కేసు నమోదు అయ్యాయి.
తాజా కేసులు కూడా కలుపుకుంటే కర్నూలులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 491కి పెరిగింది. రాష్ట్రం మొత్తంలో కరోనా కేసులు 1650కి చేరాయి. ఇప్పటికే 524 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1093 ఉన్నాయి.